అక్షరటుడే, వెబ్ డెస్క్ : రెండు రోజుల పాటు మురిపించిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం సెన్సెక్స్ 131 పాయింట్లు, నిఫ్టీ 95 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కాస్త తేరుకున్నా.. చివరి సెషన్లో అమ్మకాల ఒత్తిడితో ఇండెక్స్లు పడిపోయాయి. సెన్సెక్స్ 426 పాయింట్లు, నిఫ్టీ 126 పాయింట్ల నష్టంతో ముగిశాయి. అదానీ గ్రూప్ స్టాక్స్ తో పాటు బ్రిటనియా, టాటా కన్స్యూమర్, బజాజ్ ఆటో, హీరో మోటార్, మారుతి, ఇండస్ ఇండ్ బ్యాంకు, రిలయన్స్ షేర్లు లాభపడగా సిప్లా, ఆక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఎస్బీఐ, హెచ్ డీఎఫ్సీ బ్యాంకు, లైఫ్, ఇన్ఫోసిస్, శ్రీరాం ఫైనాన్స్ నష్టపోయాయి. రైల్వే స్టాక్స్ రాణించాయి.