అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తలుపులు తెరుచుకున్నాయి. ఆదివారం మధ్యాహ్నం రహస్యగదిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక అధికారుల బృందం తెరించింది. చివరిసారిగా 1978లో గదిని తెరిచి సంపదను లెక్కించారు. నాడు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు 70 రోజుల సమయం పట్టింది. తాజాగా ఈ రోజు భారీ భద్రత నడుమ రహస్య భాండాగారాన్ని ఓపెన్‌ చేశారు. ఆలయంలోని సంపదను మరోచోటకు తరలించేందుకు ఐదు భారీ చెక్కపెట్టెలను సిద్ధం చేసి తీసుకువచ్చారు. ఆభరణాలను పటిష్ట భద్రత నడుమ తరలించి లెక్కించనున్నట్లు తెలుస్తోంది.