అక్షరటుడే, ఇందూరు: రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందడానికి కారణమైన డ్రైవర్ కు జైలు శిక్ష పడింది. 5వ టౌన్‌ ఎస్సై గంగాధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 2017లో నగరంలోని ఇంద్రాపూర్‌ వద్ద రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. మంగళవారం విచారించిన న్యాయమూర్తి వడ్డి హరికుమార్ ఆటో డ్రైవర్‌ సర్దార్‌ అహ్మద్‌కు ఏడాది జైలుశిక్ష, రూ.1,000 జరిమానా.. ఆటో యజమాని మహమ్మద్‌ గౌసుద్దీన్‌కు రూ.500 జరిమానా విధించారు. ఏపీపీవో భూసారపు రాజేశ్‌ గౌడ్‌ విచారించారు. కోర్టు కానిస్టేబుళ్లు బాలకృష్ణ, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.