అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Earthquake | మయన్మార్(Myanmar), థాయిలాండ్ Thailand దేశాల్లో భూకంపాలు భారీ విషాదాన్ని మిగిల్చింది. నిమిషాల వ్యవధిలో వచ్చిన రెండు భూకంపాలు అక్కడి ప్రజలకు తీరని వేదనను మిగిల్చాయి. మొదటి భూకంప తీవ్రత Earthquake intensity 7.7గా, రెండో భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. తక్కువ లోతులు భూకంప కేంద్రం ఉండడంతో పాటు, తీవ్రత అధికంగా నమోదు కావడంతో భారీగా నష్టం జరిగింది.
Earthquake | మయన్మార్‌లో 20 మంది మృతి
భూకంపం దాటికి మయన్మార్‌లో 20 మంది మృతి చెందినట్లు సమాచారం. చాలా భవనాలు నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భవనాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు Relief measures కొనసాగుతున్నాయి. కాగా భూకంపాలతో రెండు దేశాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం చోటు చేసుకుంది.
Earthquake | థాయ్‌లాండ్‌లో ఎమర్జెన్సీ
బ్యాంకాక్(Bangkok)లో భూకంపం తీవ్రత అధికంగానే ఉంది. మాండలేలో చారిత్రక అవా బ్రిడ్జి కూలిపోయింది. పలు బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టం అయ్యాయి. దీంతో థాయ్‌లాండ్ ప్రధాని దేశంలో ఎమర్జెన్సీ విధించారు. బ్యాంకాక్ Bangkokలో రైల్వే, మెట్రో సేవలు నిలిపివేశారు. థాయ్‌లాండ్ ఎయిర్‌పోర్టు (Airport)లో లాక్‌డౌన్ విధించారు. అన్ని విమాన సర్వీసులు రద్దు చేశారు. థాయ్‌లాండ్‌కు వచ్చే విమానాలను దారి మళ్లించారు.
Earthquake | రోడ్లపైనే ప్రజలు
వరుస భూకంపాలతో మయన్మార్, థాయ్‌లాండ్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలువురు కూలిన భవనాల కింద చిక్కుపోగా.. మిగతా భవనాల్లో ఉన్న వారిని అధికారులు ఖాళీ చేయించారు. దీంతో ప్రజలు రోడ్లపైనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
Earthquake | ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
థాయిలాండ్, మయన్మార్ భూకంపంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆందోళన వ్యక్తం చేశారు. సాధ్యమైన సహాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సహాయక చర్యల కోసం మయన్మార్, థాయిలాండ్ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని విదేశాంగ శాఖను ఆయన ఆదేశించారు.