అక్షరటుడే, వెబ్‌డెస్క్ : హర్యానాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగడం లేదని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలకు ఎలక్షన్ కమిషన్ కౌంటర్ ఇచ్చింది. కౌంటింగ్ ప్రక్రియ అంతా అభ్యర్థుల సమక్షంలో కొనసాగుతోందని తెలిపింది. ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సవ్యంగా సాగుతుందని కాంగ్రెస్ పార్టీకి ఈసీ వివరణ ఇచ్చింది. ఇప్పటివరకు ఏ కౌంటింగ్ కేంద్రం నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఈసీ పేర్కొంది. కాంగ్రెస్ ముందంజలో ఉన్న నియోజకవర్గాల వివరాలు వేగంగా వెల్లడించలేదని ఈసీపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరాం రమేశ్ కొద్దిసేపటి క్రితం ఆరోపణలు చేశారు.