అక్షరటుడే, వెబ్‌డెస్క్ : జన్వాడ ఫామ్‌హౌస్ రేవ్ పార్టీ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఉన్న విషయం తెలిసిందే. ఈక్రమంలో రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్‌లోని నంబర్ 40 విల్లాలో నివాసం ఉంటున్న రాజ్ పాకాల ఇంట్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం సోదాలు నిర్వహిస్తుంది. అలాగే ఈవ్యవహారంలో మరోసారి జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. రాజ్ పాకాల స్వయంగా రేవ్ పార్టీ నిర్వహించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో కార్తీక్ అనే వ్యక్తిని ఏ-1గా, రాజ్ పాకాలను ఏ-2గా చేర్చారు.