Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Mlc elections | కరీంనగర్- ఆదిలాబాద్ -మెదక్- నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. కరీంనగర్​లో కౌంటింగ్​ ప్రక్రియ మంగళవారం రెండో రోజు కొనసాగుతోంది. మొదటి రౌండు ఫలితాలను పరిశీలిస్తే.. పోటీ హోరాహోరీగా కొనసాగినట్లు తెలుస్తోంది.

Mlc elections | కాంగ్రెస్ ఓట్లు చీల్చిన బీఎస్పీ అభ్యర్థి!

మొదటి రౌండ్​ ఫలితాల్లో ముగ్గురు ప్రధాన అభ్యర్థులకు పోటాపోటీగా ఓట్లు వచ్చాయి. వీరి మధ్య తేడా కేవలం వందల సంఖ్యలో మాత్రమే ఉంది. కాగా.. కాంగ్రెస్ ఓట్లను బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ పెద్ద మొత్తంలో చీల్చినట్లు స్పష్టమవుతోంది. ఈయన జాతీయ పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చినట్లు మొదటి రౌండ్ ఫలితాల ద్వారా వెల్లడవుతోంది.

Mlc elections | మొత్తం 14 రౌండ్లలో కౌంటింగ్​

మొత్తం 14 రౌండ్లు కాగా.. మొదటి ప్రాధాన్యం ఓట్ల మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి చిన్న మైల్ అంజిరెడ్డి 24 ఓట్లతో ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి మైల్ అంజిరెడ్డి – 6,697, కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి – 6,673, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ – 5,897 ఓట్లు సాధించారు.

Advertisement