Advertisement

అక్షరటుడే, హైదరాబాద్: హైదరాబాద్ నగర వాసులకు నుమాయిష్ నిర్వాహకులు శుభవార్త చెప్పారు. ఎగ్జిబిషన్ ను మరో రెండు రోజులు పొడిగిస్తున్నట్లు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15వ తేదీతో నాంపల్లి నుమాయిష్ ముగియనుంది. ఈ క్రమంలో మరో రెండు రోజులు పొడిగించాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ను మంగళవారం ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు కోరగా.. ఆయన సానూకూలంగా స్పందించి అనుమతి ఇచ్చారు. దీంతో 17వ తేదీ వరకు నాంపల్లి నుమాయిష్ కొనసాగుతుందని ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రెటరీ సురేందర్ రెడ్డి తెలిపారు.

Advertisement