అక్షరటుడే, వెబ్ డెస్క్ : విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం లేదు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో పతనం కొనసాగుతూనే ఉంది. మంగళవారం ఉదయం మార్కెట్లు లాభాలతోనే ప్రారంభమైనా ఎక్కువసేపు నిలదొక్కుకోలేకపోయాయి. అమ్మకాల ఒత్తిడితో చివరికి సెన్సెక్స్ 820 పాయింట్లు నష్టపోయి 78,675 పాయిట్ల వద్ద క్లోజ్ కాగా.. నిఫ్టీ 257 పాయింట్లు పడిపోయి 23,883 పాయిట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఫిఫ్టీలో ట్రెంట్ ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, గ్రాసిమ్ స్వలంగా లాభపడగా.. మిగిలిన స్టాక్స్ భారీగా పడిపోయాయి. దీంతో బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ మంగళవారం ఒక్కరోజే రూ. 6 లక్షల కోట్లు ఆవిరయ్యింది. మంగళవారం ఎఫ్‌ఐఐలు రూ.3,024 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. డీఐఐలు రూ. 1,854 కోట్ల స్టాక్స్ కొనుగోలు చేశారు.
క్షీణిస్తున్న రూపాయి విలువ
డాలరుతో రూపాయి మారకం విలువ రోజురోజకు క్షీణిస్తోంది. మంగళవారం రూ. 84.40 వద్ద జీవనకాల కనిష్టానికి చేరింది.