అక్షరటుడే, వెబ్​డెస్క్​: దేశీయ స్టాక్ మార్కెట్లలో పతనం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం ఫ్లాట్​గా ప్రారంభమైన ఇండెక్స్​లు కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో ఏ స్థాయిలోనూ కోలుకోలేకపోయాయి. ఇంట్రా డేలో సెన్సెక్స్ గరిష్టంగా 1,281 పాయింట్లు, నిఫ్టీ 397 పాయింట్లు నష్టపోయాయి. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1,130 పాయింట్లు, నిఫ్టీ 350 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఎనర్జీ, ఫార్మా, ఐటీ, ఆటో, ఫైనాన్స్ రంగాల షేర్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. నిఫ్టీ 50లో అదానీ ఎంటర్​ప్రైజెస్​, గ్రాసిం మాత్రమే లాభాల్లో ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్, ఐచర్ మోటార్స్, ఎయిర్​టెల్​ షేర్లు ఆరు శాతానికి పైగా పడిపోగా శ్రీరాం ఫైనాన్స్, బీఈఎల్, హెచ్​డీఎఫ్​సీ లైఫ్, కోల్ ఇండియా 3 శాతానికి పైగా నష్టంతో కొనసాగుతున్నాయి.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Stock market | ఎఫ్‌ఐఐ(FII)లు దారికొచ్చినట్లేనా?