Advertisement

హైదరాబాద్, అక్షరటుడే: రాష్ట్రంలో రైతు భరోసా లెక్క తేలింది. రాష్ట్రవ్యాప్తంగా సాగుకు యోగ్యమైన భూములు 1.49 కోట్ల ఎకరాలు ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. సీజన్ కు ఎకరాకు రూ.6 వేల చొప్పున ఇచ్చేందుకు మొత్తం రూ.8,900 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. రాళ్లు, రప్పలు, కొండలు, వెంచర్లు, హైవేలు, ఇరిగేషన్, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్న భూముల లెక్క కూడా తేల్చారు. ఇవి 3 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్టు గుర్తించారు. గ్రామసభల్లో ఈ సర్వే నెంబర్లను ఆన్లైన్లో బ్లాక్ చేస్తున్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Vijayashanti : తెలంగాణ కాంగ్రెస్ పనితీరును అంచ‌నా వేస్తున్న‌ ఏఐసీసీ.. విజ‌య‌శాంతికి కీల‌క ప‌ద‌వి