Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రాష్ట్రంలో తొలి జీబీఎస్‌ మరణం నమోదైంది. గిలియన్‌ బారె సిండ్రోమ్‌ పేరుతో పిలవబడుతున్న ఈ వైరస్‌ కారణంగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న సిద్ధిపేటకు చెందిన మహిళ శనివారం రాత్రి మృతి చెందింది. ఇప్పటివరకు మహారాష్ట్రలో 183కు పైగా జీబీఎస్‌ కేసులు కేసులు నమోదు కాగా.. తెలంగాణలో ఈ సిండ్రోమ్‌ కారణంగా తొలి మరణం సంభవించింది.

జీబీఎస్‌ లక్షణాలివే..

కలుషిత ఆహారం.. బ్యాక్టీరియా లేదా ఇన్ఫెక్షన్స్ కారణంగా జీబీఎస్‌ సోకుతుంది. జ్వరం, వాంతులు, ఒళ్లంతా తిమ్మిర్లు, డయేరియా, పొత్తికడుపు నొప్పి, నీరసం, కండరాల బలహీనత లాంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఇలాంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Advertisement