అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు శుక్రవారం శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో భాగంగాలో రాష్ట్ర వ్యాప్తంగా 28 నియోజకవర్గాల్లో శంకుస్థాపన నిర్వహించనున్నారు. వీటి నిర్మాణం కోసం రూ. 5వేల కోట్లను వెచ్చించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొందుర్గ్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాగా.. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో విశాలమైన క్యాంప్‌లో ఈ స్కూళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. వీటిలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తామని సీఎం ఇటీవల ప్రకటించారు.