BRS Nizamabad | భవిష్యత్తు బీఆర్​ఎస్​ పార్టీదే..

BRS Nizamabad | భవిష్యత్తు బీఆర్​ఎస్​ పార్టీదే..
BRS Nizamabad | భవిష్యత్తు బీఆర్​ఎస్​ పార్టీదే..

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : BRS Nizamabad | రాష్ట్రంలో భవిష్యత్తులో బీఆర్​ఎస్​ పార్టీ(BRS Party)నే అధికారంలోకి వస్తుందని బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు జీవన్​ రెడ్డి(Jeevan Reddy), అర్బన్​ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్​గుప్తా(Bigala Ganesh Gupta) పేర్కొన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయం(Party Office)లో వారిరువురి ఆధ్వర్యంలో నగరంలోని 12, 30, 31 డివిజన్లలోని మైనారిటీలు బీఆర్​ఎస్(BRS)​లో చేరారు. ఈ సందర్భంగా జీవన్​రెడ్డి, బిగాల మాట్లాడుతూ.. ప్రస్తుతం నగరంలో రాత్రివేళ్లలో ఎటుచూసినా అంధకారమే కనిపిస్తోందన్నారు. బీఆర్​ఎస్​ హయాంలో నగరంలోని శివారు ప్రాంతాల్లోనూ చీకట్లు లేకుండా చూశామన్నారు.

Advertisement
Advertisement

రాష్ట్రంలో కాంగ్రెస్(Congress)​పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత ఉందన్నారు. కేసీఆర్​ కిట్​(KCR Kit)లు ఇవ్వడం నిలిచిపోయిందన్నారు. తాజాగా చేసిన సర్వేలో కాంగ్రెస్​ పార్టీ(Congress Party)కి పది సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని తేలిందన్నారు. కాంగ్రెస్​ పార్టీలో నుంచి సైతం బీఆర్​ఎస్​(BRS)లోకి కార్యకర్తలు రావడం చూస్తుంటే ఆ పార్టీపై ప్రజల్లో ఎంత వ్యతిరేఖత ఉందో తెలిసిపోతుందన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్​ఏ సీఎం(CM) అవుతారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్(Neethu Kiran Shekhar), మాజీ నుడా ఛైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్, జగత్ రెడ్డి, చింతకాయల రాజు, నవీద్ ఇక్బాల్, మతిన్, ఇమ్రాన్ షహజాద్​, సనావుల్లా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad Police | క్షణికావేశంలో కత్తితో పొడుచుకున్న వ్యక్తి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి