అక్షరటుడే, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గీతా పారాయణానికి ప్రపంచ గిన్నిస్ రికార్డు లభించింది. లాల్‌పరేడ్ మైదానంలో బుధవారం గీతా జయంతి సందర్భంగా దాదాపు 5వేల మంది భక్తులు హాజరై గీతా పఠనం చేశారు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్సులో నమోదైంది. ఈ కార్యక్రమానికి సీఎం మోహన్ యాదవ్ హాజరయ్యారు.