అక్షరటుడే, ఎల్లారెడ్డిః శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. సోమవారం లింగంపేట అంబేడ్కర్ చౌరస్తా నుంచి ప్రధాన వీధుల గుండా ఏ ఆర్ ఎఫ్ జవాన్లతో, పోలీస్ సిబ్బందితో కవాతు నిర్వహించారు.
అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. వచ్చే రంజాన్ పండగను కులమతాలకతీతంగా పండగలు జరుపుకోవాలని సూచించారు. సుమారు 50 మంది సిబ్బంది స్పెషల్ పార్టీ పోలీసుల ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకట్రావు, రిజర్వ్ ఎస్సై సాయి తదితరులు పాల్గొన్నారు.