అక్షరటుడే, వెబ్‌డెస్క్ : యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటెరీ రవిగుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు అమరుల పిల్లలు, పోలీసులతో పాటు ఇతర యూనిఫామ్ సర్వీసులైన ఫైర్, ఎక్సైజ్ సిబ్బంది పిల్లలకు పోలీస్ స్కూల్లో అడ్మిషన్లు కల్పించనున్నట్లు తెలిపారు. పోలీసుల పిల్లల కోసం నాణ్యమైన విద్య అందించేలా సీఎం రేవంత్‌రెడ్డి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.