అక్షరటుడే, వెబ్‌డెస్క్ : భారీ వర్షాల నేపథ్యంలో చెన్నై, తిరుచ్చి, నాగపట్నం, తంజావూరు, తిరువరూర్ తదితర ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ‘ఫెంగల్’ తుఫాను ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్టాలిన్ ప్రజలకు సూచించారు.