అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రాష్ట్రంలోని పోలీసులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పోలీస్‌ సిబ్బంది సరెండర్‌ లీవ్‌లకు సంబంధించిన రూ.182.48 కోట్లు విడుదల చేసింది. నిధులను మంజూరు చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో పోలీస్‌ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.