అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. టూరిజం కల్చరల్ సెక్రెటరీగా స్మితాసబర్వాల్, బీసీ వెల్ఫేర్ సెక్రెటరీగా శ్రీధర్, మహిళా శిశుసంక్షేమ శాఖ సెక్రటరీగా అనితా రామచంద్రన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి, ట్రాన్స్‌కో సీఎండీగా కృష్ణభాస్కర్, ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌గా సురేంద్రమోహన్, పంచాయతీ రాజ్ డైరెక్టర్‌గా శ్రీజన, ఆయుష్ డైరెక్టర్‌గా చిట్టెం లక్ష్మి, ఆరోగ్యశ్రీ సీఈవోగా శివశంకర్, ఇంటర్ బోర్డు డైరెక్టర్‌గా కృష్ణ ఆదిత్య, లేబర్ కమిషనర్‌గా సంజయ్ కుమార్, జీఏడీ సెక్రెటరీగా గౌరవ్ ఉప్పల్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా హరికిరణ్‌లను బదిలీ చేశారు.
