అక్షరటుడే, కామారెడ్డి: Telangana University | యూనివర్సిటీలో పనిచేస్తున్న తమను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని సౌత్ క్యాంపస్ కాంట్రాక్టు లెక్చరర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ భిక్కనూరు సౌత్ క్యాంపస్‌లో ఆల్ తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 15 ఏళ్లుగా పనిచేస్తున్న తమ సర్వీస్‌ను ప్రభుత్వం గుర్తించకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అర్హతలున్నా తమను రెగ్యులరైజ్(Regularize) చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ప్రభుత్వం(Government) స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. అనంతరం ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సౌత్ క్యాంపస్ అధ్యాపకులు యాలాద్రి, సునీత, నర్సయ్య, రమాదేవి, నిరంజన్, వైశాలి, దిలీప్, శ్రీకాంత్ పాల్గొన్నారు.