అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: డిజిటల్‌ క్రాప్‌ సర్వేను వ్యతిరేకిస్తున్న ఏఈవోలను క్రమశిక్షణ చర్యల పేరుతో దారిలోకి తెచ్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా 150 మందికి పైగా ఏఈవోలపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు సమాచారం. కాగా, ప్రభుత్వ తీరుపై ఏఈవోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.