అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: హైడ్రా ఆర్డినెన్స్‌కు తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన హైడ్రాకి చట్టబద్ధత కల్పిస్తూ గవర్నర్‌ సంతకం చేశారు. హైడ్రాకు చట్టబద్ధత లేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సమయంలో ప్రభుత్వం తెచ్చిన హైడ్రా ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం తెలపడం గమనార్హం.