అక్షరటుడే, ఇందూరు: నగరంలో డ్వాక్రా మహిళలను మోసం చేస్తున్న అన్సుజారెడ్డిపై చర్యలు తీసుకోవాలని గ్రూప్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌లో మెప్మా పీడీ రాజేందర్‌కు నవయుగ బాట సమాఖ్య ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షురాలు విజయ మాట్లాడుతూ.. అన్సుజారెడ్డి ఓ పార్టీకి చెందిన నాయకురాలిగా చెలామణి అవుతూ డ్వాక్రా మహిళలను మోసం చేసిందన్నారు. లోన్‌లో సగం డబ్బులు మహిళలకు ఇచ్చి, మిగితా డబ్బులు తను వాడుకుని తిరిగి మొత్తం డబ్బులు వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్‌ చేస్తోందన్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు.