అక్షరటుడే, వెబ్ డెస్క్: తప్పుడు వివరాలతో పిటిషన్ వేసిన వ్యక్తికి హైకోర్టు జరిమానా విధించింది. ఓ కేసులో తప్పుడు వివరాలతో పిటిషన్ వేసి కోర్టు సమయం వృథా చేసినందుకు పిటిషనర్‌కు రూ.5 వేల జరిమానా వేసింది. ఈ మొత్తాన్ని సీఎం సహాయనిధికి జమ చేయాలని ఆదేశించింది. తప్పుడు వివరాలతో పిటిషన్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది.