అక్షరటుడే, వెబ్‌డెస్క్: హైడ్రాపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తి చేసింది. సెలవు రోజుల్లో కూల్చివేతలు చేపట్టడంపై మండిపడింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగిలో ప్రవీణ్ అనే వ్యక్తికి సంబంధించిన షెడ్‌ను ఆదివారం హైడ్రా అధికారులు కూల్చివేశారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా కూల్చివేశారని ఆయన కోర్టును ఆశ్రయించాడు. దీంతో విచారణ సందర్భంగా హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌పై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలవు రోజుల్లో కూల్చివేతలు చేపట్టొద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవల్సిందే..!
Advertisement