అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బడాబాబులు సంపాదిస్తుంటే వారి పిల్లలు పబ్బుల్లో హంగామా చేస్తూ.. ర్యాష్‌ డ్రైవింగ్‌తో ప్రమాదాలకు కారణమవుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. జూబ్లీహిల్స్‌లో 55-60 పబ్ లు ఉన్నాయని తెలిపింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌- 12, జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌ -36లో రోజుకో ప్రమాదం చోటు చేసుకుంటుందని పేర్కొంది. పబ్‌లకు సంబంధించి కొన్ని నిబంధనలు విధించాలని, స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టి ప్రమాదాలను నివారించాలని అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌కు హైకోర్టు సూచించింది.