అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెల్లడించింది. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. వారిపై వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం ద్వి సభ్య ధర్మాసనం విచారణ జరిపింది. అనర్హతపై తుది నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉందని పేర్కొంది. పదో షెడ్యూల్ ప్రకారం అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో నాలుగు వారాల్లో ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సింగిల్ బెంచ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.