అక్షరటుడే, బాన్సువాడ : తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ ఆలయాల పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం వర్ని, కోటగిరి మండల కేంద్రాల్లో సమితి సభ్యుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు.