Mahatma Jyotiba Phule | ఆదర్శప్రాయుడు మహాత్మా జ్యోతిబా పూలే

Mahatma Jyotiba Phule | ఆదర్శప్రాయుడు మహాత్మా జ్యోతిబా పూలే
Mahatma Jyotiba Phule | ఆదర్శప్రాయుడు మహాత్మా జ్యోతిబా పూలే

అక్షరటుడే, నిజాంసాగర్​: Mahatma Jyotiba Phule | నేటి యువతకు మహాత్మా జ్యోతిబా పూలే ఆదర్శప్రాయుడని ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ ఛైర్మన్​ దఫెదార్​ రాజు పేర్కొన్నారు. పిట్లం మండల కేంద్రంలో శుక్రవారం మహాత్మా జ్యోతిబా పూలే(Mahatma Jyotiba Phule) చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజహితం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి పూలే అని కొనియాడారు. కార్యక్రమంలో పిట్లం మాజీ ఎంపీపీ కవిత విజయ్, మాజీ వైస్ ఎంపీపీ నర్సాగౌడ్​, నాయకులు మహేందర్, సంగమేశ్వర్ గౌడ్, జొన్న శ్రీనివాస్ రెడ్డి, శివకుమార్ జైపాల్ తదితరులు ఉన్నారు.

Advertisement

Mahatma Jyotiba Phule | బోధన్​లో..

అక్షరటుడే, బోధన్: పట్టణంలోని అంబేడ్కర్​ చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘం​ ఆధ్వర్యంలో పూలే జయంతి(Phule Jayanti) వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ నియోజకవర్గ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, బీసీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సంతోష్, నాయకులు రవీందర్ గౌడ్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement