అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ఒకే దేశం ఒకే ఎన్నిక విషయంలో కాంగ్రెస్, వామపక్ష, ప్రాంతీయ పార్టీలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఒకే దేశం ఒకే ఎన్నిక బీజేపీ దృక్కోణంపై నిర్వహించిన వర్క్ షాప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో విడివిడిగా ఎన్నికల నిర్వహణతో ఆర్థికభారంతో పాటు రాజకీయ అనిశ్చితి ఏర్పడుతుందన్నారు. అందుకే ప్రధాని మోదీ దూర దృష్టితో జమిలి ఎన్నికలపై కమిటీ వేశారన్నారు. జమిలి ఎన్నికల అంశంపై బీజేపీ దృక్కోణాన్ని జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో కార్యశాలలు నిర్వహించి కార్యకర్తలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వర్క్ షాప్ చేపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్, రంజిత్ మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నరేందర్ రెడ్డి, రవీందర్ రావు, కార్యక్రమ కన్వీనర్ లింగరావు, నాయకులు వేణు, శ్రీనివాస్, లక్ష్మి నారాయణ, భరత్, నరేందర్, రమేష్, శ్రీధర్,తదితరులు పాల్గొన్నారు.
Kamareddy | ఒకే దేశం ఒకే ఎన్నికపై కావాలనే రాద్ధాంతం
Advertisement
Advertisement