అక్షరటుడే, ఇందూరు: జిల్లా కేంద్రంలో వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది. మొదట దుబ్బ చౌరస్తాలోని బాలగంగాధర్ తిలక్ విగ్రహానికి పూలమాలవేసి రథయాత్రను ప్రారంభించారు. భక్తులు రథాన్ని లాగడానికి పోటీపడ్డారు. శోభాయాత్ర కొనసాగే దారి కోలాహలంగా మారింది. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, సార్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షుడు బంటు గణేష్ తదితరులు పాల్గొన్నారు.