అక్షరటుడే, బోధన్: క్లాస్ రూంలో విద్యార్థిని టీచర్ కొట్టడంతో తలపై తీవ్ర గాయమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోధన్ పట్టణ శివారులోని ప్రజ్ఞ స్కూల్లో శివసాయి కృష్ణ అనే విద్యార్థి నాలుగో తరగతి చదువుతున్నాడు. నాలుగు రోజుల క్రితం తరగతి గదిలో టీచర్ ఎగ్జాం ప్యాడ్‌తో కొట్టడంతో తలకు తీవ్ర గాయమైంది. అయినా పాఠశాల సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు. ఆదివారం మరో విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్‌కు రాగా విషయం తెలియడంతో వారు వెంటనే శివసాయి కృష్ణ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే పాఠశాలకు వచ్చి యాజమాన్యాన్ని నిలదీశారు. విద్యార్థి తలకు తీవ్ర గాయమైనా సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విద్యార్థిని తీసుకెళ్లి చికిత్స చేయించారు.