Advertisement

అక్షరటుడే, ఇందల్వాయి: చెరువులో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అగు వంశీ (27) ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని దక్కల్ చెరువులో వంశీ మృదేహం తేలింది. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు.

Advertisement