Advertisement
అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: ఆర్టీసీ బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటన శనివారం ఉదయం మాచారెడ్డి బస్టాండ్లో చోటు చేసుకుంది. కామారెడ్డి డిపోకు చెందిన బస్సు భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మాచారెడ్డి బస్టాండ్ వద్ద బస్సు అదుపు తప్పి స్తంభాన్ని ఢీకొంది. దీంతో స్తంభం విరిగిపోయింది. ప్రయాణికులు బస్సు దిగి పరుగులు పెట్టారు. వెంటనే కరెంట్ సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు.
Advertisement