అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: నగరంలో బాలికపై అత్యాచారయత్నం ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రెండోటౌన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఠాణా ఏరియాలోని ఓ కాలనీకి చెందిన బాలిక శుక్రవారం మధ్యాహ్నం సమయంలో కిరాణషాపుకు వెళ్లి వస్తుండగా ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు.