అక్షరటుడే, కామారెడ్డి : తాళం వేసి వెళ్తే ఇల్లు గుల్ల చేసిన ఘటన కామారెడ్డి పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలో జరిగింది. కామారెడ్డి టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం శ్రీరాంనగర్ కాలనీకి చెందిన చాకలి పెద్ద గంగయ్య ఉదయం 7 గంటలకు తాళం వేసి 11:30 గంటలకు తిరిగి వచ్చే లోపు ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోని వంట గదిలో పెట్టిన స్టీల్ డబ్బాలో ఉంచిన 4 తులాల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. చాకలి పెద్ద గంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.