అక్షరటుడే, బాన్సువాడ : రక్తపరీక్షలకు శాంపిల్స్‌ తీసుకోకుండానే రిపోర్ట్‌ ఇచ్చిన ఘటన బాన్సువాడ మాతాశిశు ఆస్పత్రిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పిట్లం మండలం మద్దెల చెరువు గ్రామానికి చెందిన గైని రామవ్వ అనారోగ్యంతో ఇటీవల బాన్సువాడ మాతాశిశు ఆస్పత్రిలో చేరింది. అయితే ఎలాంటి రక్తనమూనాలు తీసుకోకుండానే టెస్ట్‌ చేసినట్లుగా రిపోర్ట్‌ ఇచ్చారని రామవ్వ కుమారుడు తెలిపాడు. దీనిపై ఆస్పత్రి సిబ్బందిని నిలదీస్తే పొంతన లేని సమాధానాలు ఇచ్చారని వాపోయాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశాడు.