ఏపీలో దొంగలపై తెలంగాణ పోలీసుల కాల్పులు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : ఏపీలో దొంగలపై తెలంగాణ పోలీసులు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం రామాపురంలో ఈఘటన చోటు చేసుకుంది. ఓ చోరీ కేసులో విచారణకు వచ్చిన తెలంగాణ పోలీసులపై దొంగలు దాడికి యత్నించారు. దీంతో వారు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దొంగలు తప్పించుకొని పరారీ అయ్యారు. బత్తలపల్లి పోలీసులతో కలిసి దొంగల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement