హైదరాబాద్, అక్షరటుడే: తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ సినీ దర్శకుడు అదృశ్యమైన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మియాపూర్ ఫ్రెండ్స్ కాలనీ యస్వీహెచ్ ప్లాజాలో నివాసం ఉంటున్న ఓంరమేష్ కృష్ణ(46) సినీ పరిశ్రమలో దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈ నెల 4వ తేదీ ఉదయం పని నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. భార్య, కుటుంబ సభ్యులు అతని కోసం ఎంత వెతికినా జాడ దొరకలేదు. ఈమేరకు అతని భార్య శ్రీదేవి మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement