అక్షరటుడే, వెబ్ డెస్క్: మహిళ అదృశ్యం అయిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. గంగస్థాన్ ఫేస్-1కు చెందిన గట్ల విజయ(57) శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె మానసిక స్థితి సరిగా లేదని రూరల్ ఠాణా ఎస్సై తెలిపారు. భర్త గట్ల లింబాద్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.