అక్షరటుడే, ఆర్మూర్: మహిళ కాళ్ల పైనుంచి బస్సు వెళ్లడంతో ఆమెకు తీవ్ర గాయాలపాలైన ఘటన ఆర్మూర్ బస్టాండ్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్‌కు చెందిన సుజాత బుధవారం ఆర్మూర్‌కు వచ్చింది. బస్టాండ్‌లో బస్సు ఎక్కే క్రమంలో కిందపడిపోగా నిర్మల్ డిపోకు చెందిన బస్సు వెనక్కి తీసుకుంటున్న క్రమంలో ఆమె కాళ్ల పైనుంచి వెళ్లింది. దీంతో సుజాత కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. దీంతో వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.