అక్షరటుడే, కోటగిరి: రెండు గడ్డివాములు దగ్ధమైన ఘటన పోతంగల్ మండలంలో చోటుచేసుకుంది. కల్లూరు గ్రామానికి చెందిన మాదిగ భూమయ్య, కమ్మరి హర్షవర్ధన్, మేత్రి గంగాధర్ల గడ్డివాములు శుక్రవారం రాత్రి కాలిపోయాయి. ఎవరో నిప్పు పెట్టడంతో కాలిపోయినట్లు బాధితులు ఆరోపించారు. సుమారు వెయ్యి కట్టల వరకు గడ్డి దహనమైంది.