అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: గర్భిణిని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రసవించిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. సారంగపూర్‌కు చెందిన శివాణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్‌ చేశారు. అంబులెన్స్‌ సిబ్బంది గర్భిణిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి బిడ్డను నగరంలోని జీజీహెచ్‌కు తరలించారు. ఈ సందర్భంగా గర్భిణి కుటుంబీకులు 108 సిబ్బంది శివదినేశ్‌, రమేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.