అక్షరటుడే, బాన్సువాడ: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని మోస్రాలో చోటు చేసుకుంది. వర్ని ఎస్సై కృష్ణ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మోస్రా గ్రామానికి చెందిన సంఘం సాయిలు(46) ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఈనెల 5న ఇంటి నుంచి వెళ్లిపోయి గ్రామ ఊర చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం స్థానికులు చెరువులో మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.