అక్షర టుడే బోధన్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష పడినట్లు బోధన్ పోలీసులు తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపిన ఇద్దరిని పట్టుకొని సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శేషతల్ప సాయి ముందు హాజరుపర్చారు. విచారణ అనంతరం నిందితులకు మెజిస్ట్రేట్ రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించినట్లు బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు.