అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: పాముకాటుతో బాలుడు మృతి చెందిన ఘటన మోపాల్ మండలం అమ్రాబాద్ పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. గుండ్య నాయక్ తండాకు చెందిన నేనావత్ వరుణ్(14) మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రించగా పాము కాటు వేసింది. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.