Advertisement

అక్షరటుడే, కామారెడ్డి: సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 18వ రోజుకు చేరింది. శుక్రవారం మున్సిపల్ వద్ద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు ఉద్యోగులు ర్యాలీగా వెళ్లి కిరాణా షాపులు, హోటళ్లలో భిక్షాటన చేశారు. 18 ఏళ్లుగా తాము పనిచేస్తున్నా ప్రభుత్వం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలో జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సంపత్, మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు రాములు, సంతోష్ రెడ్డి, వనజ, శైలజ, వీణ, లావణ్య, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Kamareddy MLA | మున్సిపల్‌ ఉద్యోగులపై ఎమ్మెల్యే గరంగరం..