అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధానమైన నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరదనీరు వచ్చి చేరుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 785 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00అడుగుల(17.80 టీఎంసీలు)కు గాను సోమవారం ఉదయం ప్రాజెక్టులో 1387.72 అడుగుల(3.19 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ఇక శ్రీరాంసాగర్ జలాశయంలోకి 20,023 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు(80 టీఎంసీలు) కాగా సోమవారం ఉదయం వరకు 1068.20 అడుగుల (20.518 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.