అక్షరటుడే, వెబ్‌డెస్క్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 30 టీఎంసీలకు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కొన్నిరోజులుగా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయంలోకి ప్రస్తుతం 27,850 క్యూసెక్యుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో డ్యాంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80 టీఎంసీలు కాగా శనివారం ఉదయం వరకు 29.932 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
నిజాంసాగర్‌లోకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ప్రస్తుతం ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. డ్యాంలోకి 870 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 17.8 టీఎంసీలు కాగా శనివారం ఉదయం వరకు 3.589 టీఎంసీల నీరు నిల్వ ఉంది.